AP Assembly : అసెంబ్లీ లాబీలో పేర్ని నాని- గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ..

అసెంబ్లీ లాబీలో వైసీపీ నేత, పేర్ని నాని, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇద్దరు మధ్యా ముందస్తు ఎన్నికల ముచ్చట్లు జరిగాయి. రామ మందిరానికి ఎన్నికలకు ముడిపెడుతు మాట్లాడుకున్నారు.

AP Assembly : అసెంబ్లీ లాబీలో పేర్ని నాని- గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ..

Perni Nani and Gorantla Butchaiah Chaudhary

Updated On : September 21, 2023 / 1:13 PM IST

Perni Nani-Gorantla Butchaiah Chaudhary : అసెంబ్లీ లాబీలో వైసీపీ నేత, పేర్ని నాని, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లోని టీడీఎల్పీ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్నినాని మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. సభలో జరిగిన పరిణామాలను పేర్ని నాని లాబీల్లో వివరించిన క్రమంలో నాని మాట్లాడుతు..బుచ్చయ్య మనస్సు చంపుకుని రాజకీయం కోసం పనిచేస్తున్నారని అన్నారు.దానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయం కోసం కాదు రాజ్యాంగం కోసం పనిచేస్తున్నాను అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్యా ముందస్తు ఎన్నికల గురించి కూడా ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. ప్రస్తుతం కేంద్రం వ్యవహరిస్తోన్న తీరు చూస్తోంటే ఈ సెషన్సే చివరి సెషన్సులా ఉన్నాయని..డిసెంబర్ నెలలో ఎన్నికలు వస్తాయేమోనని బుచ్చయ్య అంటే .. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయ్యాకే ఎన్నికలు ఉంటాయోమోనని పేర్ని నాని అన్నారు.

AP Assembly : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
కాగా ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయిన కొద్దిసేపటికే వాడి వేడిగా తయారైంది. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాటల యుద్ధాలు జరిగాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు .. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పితే.. వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి తొడకొట్టారు. ఇలా అసెంబ్లీ సమావేశం అంతా సినిమాను తలపించింది. ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.

అసెంబ్లీ వాయిదా పడడంతో టీడీఎల్పీ కార్యాలయం వద్ద గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్నినాని ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరి మధ్య అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపైనా..ముందస్తు ఎన్నికలపై వీరిద్దరి మధ్యా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అలాగే పేర్నినాని ప్రతిపక్షాన్ని విమర్శిస్తు..ప్రతిపక్షం హింసను కోరుకుంటుందని ఆరోపించారు. అలాగే బుచ్చయ్య చౌదరి మనసు చంపుకొని రాజకీయం కోసం పనిచేస్తున్నారని అనగా దానికి గోరంట్ల రాజకీయం కోసం కాదు, రాజ్యాంగం కోసం తాను పనిచేస్తున్నానని కౌంటరిచ్చారు.

AP Assembly : అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ .. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి అంబటి