Home » AP Capital Row
విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం ద్వారా మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం కోరుతున్నారా?
అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాదయాత్రలో సడలింపులను కోరుతూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను, అటు పాదయాత్రను రద్దు చేయాలని డీజీపీ వేసిన పిటిషన్ రెండింటిని కొట్టేసింది.
అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పోలీసుల తీరుకి నిరసనగా నాలుగు రోజుల పాటు బ్రేక్ వేశారు రైతులు. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకుంటామని అమరావతి జేఏసీ నేతలు అంటున్నారు.
గతంలో అందరూ కలిసి రాజధానిగా అమరావతిని నిర్ణయించారని జయప్రకాశ్ నారాయణ గుర్తుచేశారు. తుగ్లక్ కూడా తరచూ రాజధానులను మార్చారని అన్న ఆయన.. రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
సన్నాసులు, వెధవలు అంటూ మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు కొడాలి నాని. పరిపాలన రాజధాని ప్రకటించక ముందు నుంచే విశాఖలో భూముల ధరలు కోట్లలో ఉన్నాయన్నారు.
విశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బోండా ఉమ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.