Jayaprakash Narayan : ఏపీకి రాజధాని అమరావతే, రాజధానులు మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు-జేపీ హాట్ కామెంట్స్

గతంలో అందరూ కలిసి రాజధానిగా అమరావతిని నిర్ణయించారని జయప్రకాశ్ నారాయణ గుర్తుచేశారు. తుగ్లక్ కూడా తరచూ రాజధానులను మార్చారని అన్న ఆయన.. రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.

Jayaprakash Narayan : ఏపీకి రాజధాని అమరావతే, రాజధానులు మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు-జేపీ హాట్ కామెంట్స్

Jayaprakash Narayan : ఏపీ రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, విపక్షాల మధ్య వివాదం రాజేసింది. ఏపీకి ఒక్కటే రాజధాని, అదీ అమరావతే అని టీడీపీ వాదిస్తుంటే.. ఒక్కటి కాదు మూడు రాజధానులు అని ప్రభుత్వం అంటోంది. ఆరు నూరైనా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామంటోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని అంశంపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని అమరావతే అని ఆయన తేల్చి చెప్పారు.

”గతంలో అందరూ కలిసి రాజధానిగా అమరావతిని నిర్ణయించారని జయప్రకాశ్ నారాయణ గుర్తుచేశారు. తుగ్లక్ కూడా తరచూ రాజధానులను మార్చారని అన్న ఆయన.. రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం తికమక చేసిందని, ఎక్కడా స్పష్టత లేదని చెప్పారు. రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి అమలు చేయాలని జేపీ సూచించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఒక సార్వభౌమ అధికారం ఉన్న ప్రభుత్వం ఇండిపెండెంట్ గా హామీ ఇచ్చిన తర్వాత, రాతపూర్వకంగా ఒక కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత వెనక్కి వెళ్లే హక్కు లేదని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం శాశ్వతమైనది. ఎన్నిక విప్లవం కాదు. ప్రభుత్వం మారిందంటే మొత్తం కూల్చి పారేశాం అని కాదు. అందరూ కలిసి కూర్చుని చట్టబద్దంగా ఒక నిర్ణయం చేశాక రాజధాని మార్చడం కరెక్ట్ కాదు. రేపు అధికారంలోకి మరొకరు వస్తారు, వాళ్లు రాజధానిని మారుస్తారు. రాజధానులు మార్చుకుంటూ పోవడం పరిపాలన కాదు. రాజధాని మార్చే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు” అని జేపీ తేల్చి చెప్పారు.

రాజధాని అంశంపై తారస్థాయిలో రగడ జరుగుతున్న వేళ.. ఏపీ రాజధాని అమరావతే అంటూ జేపీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాజధానులు మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చి చెప్పడం చర్చకు దారితీసింది. జేపీ కామెంట్స్ పై అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.