Kodali Nani : రాజధానిగా ప్రకటించక ముందే విశాఖలో పొలం ధరలు కోట్ల రూపాయల్లో ఉన్నాయి- కొడాలి నాని

సన్నాసులు, వెధవలు అంటూ మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు కొడాలి నాని. పరిపాలన రాజధాని ప్రకటించక ముందు నుంచే విశాఖలో భూముల ధరలు కోట్లలో ఉన్నాయన్నారు.

Kodali Nani : రాజధానిగా ప్రకటించక ముందే విశాఖలో పొలం ధరలు కోట్ల రూపాయల్లో ఉన్నాయి- కొడాలి నాని

Kodali Nani : విశాఖపట్నంపై టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారని మాజీమంత్రి కొడాలి నాని విమర్శించారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు వైజాగ్ లో కూడా జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన రాజధాని ప్రకటించక ముందు నుంచే విశాఖలో భూముల ధరలు కోట్లలో ఉన్నాయన్నారు కొడాలి నాని.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలుగుదేశం పార్టీ ఒక అస్తవ్యస్థ వ్యవస్థ. చంద్రబాబుకి 75ఏళ్లు. లోకేశ్ తినడానికి తప్పితే దేనికీ పనికి రాడు. బ్రెయిన్ లేదు. విశాఖపై విషం చిమ్ముతున్నారు. అమరావతిలో చంద్రబాబు, ఆయన బినామీలు ఏం చేశారో.. అవన్నీ వైజాగ్ లో మేము చేశామని చెబుతున్నారు. వైజాగ్ లో రూ.30లక్షల పొలం లేదు. మేము రాజధాని ప్రకటించాక రూ.30లక్షల పొలం రూ.10 కోట్లు అవ్వలేదు. అక్కడ ఆల్రెడీ భూములు, పొలాల ధరలు కోట్ల రూపాయల్లో ఉన్నాయి.

కాగా, విశాఖలో భారీ భూదోపిడీ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. విశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుంచి విలువైన భూములను తొలగించి కొట్టేశారని అంటున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.