Home » ap cm jagan
గతంలో మనుషులను వేటాడి చంపిన ఆ పులికి వయసు అయిపోయింది. ఇప్పుడు ఒక నాలుగు నక్కలను కలుపుకొని మళ్లీ కుట్రలు పన్నుతోంది అంటూ సీఎం జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డికడప నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. నార్పలలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వసతి దీవెన నిధులు జమ చేయనున్నారు.
యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు.
ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే.. అన్ని జిల్లాల అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన తపన అన్నారు.
1250 ఎకరాల్లో రూ.4362 కోట్లతో పోర్టు నిర్మాణం చేయనున్నామని తెలిపారు. పోర్టుతో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారనుందన్నారు. పోర్టు ద్వారా 35 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
తెలంగాణ మంత్రి హరీష్‌రావు మాట్లాడిన మాటలకు జగన్‌కు, మంత్రులుకు పౌరుషం రావడం లేదా.. ఏపీలో అవకాశాలు లేవని చెబితే జగన్‌కు సిగ్గు అనిపించడం లేదాఅంటూ జనసేన ఏపీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
ఎయిర్ పోర్టులో జగన్‌పై జరిగిన దాడి వాస్తవం అని, కానీ, ఎన్ఐఏ రిపోర్ట్‌ను కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని చెప్పారు. అయినా పిల్లలు స్కూల్ కు రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు.