AP CM Jagan: అనంతపురం జిల్లాకు సీఎం జగన్.. షెడ్యూల్ ఇలా.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన నిధులు
ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. నార్పలలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వసతి దీవెన నిధులు జమ చేయనున్నారు.

AP CM Jagan
AP CM Jagan: ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నార్పలలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని నార్పల వేదికగా జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేస్తారు. దీంతో.. రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు కలిపి 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమచేసినట్లవుతుంది.
AP CM Jagan : ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి : సీఎం జగన్
2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం రూ. 14,223.60 కోట్లు అందించింది. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చులకోసం ఇబ్బంది పడకుండా యేటా రెండు వాయిదాల్లో ఐటీ విద్యార్థులకు రూ. 10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15వేలు చొప్పున, మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీ, వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసించే వారికి రూ. 20వేల చొప్పున ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.
AP CM Jagan : సెప్టెంబర్ నుండి విశాఖ నుంచే పాలన.. నేను కూడా అక్కడే ఉంటా : సీఎం జగన్
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
♦ ఉదయం 9.45 గంటలకు సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
♦ 10గంటలకు పుట్టపర్తి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరుతారు.
♦ 10.30 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర హైస్కూల్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నార్పల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
♦ 10.40 గంటలకు సభాస్థలి వద్దకు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీని సీఎం జగన్ తిలకిస్తారు.
♦ 11 నుంచి 12.30 గంటలకు బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు.
♦ 1.10 గంటలకు హెలికాప్టర్ లో పుట్టపర్తి విమానాశ్రయానికి బయలుదేరుతారు.
♦ 1.40 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరుతారు.