CM Jagan : అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం… మరో 265 గ్రామాలకు వంశధార తాగునీరు : సీఎం జగన్

1250 ఎకరాల్లో రూ.4362 కోట్లతో పోర్టు నిర్మాణం చేయనున్నామని తెలిపారు. పోర్టుతో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారనుందన్నారు. పోర్టు ద్వారా 35 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

CM Jagan : అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం… మరో 265 గ్రామాలకు వంశధార తాగునీరు : సీఎం జగన్

CM Jagan

CM Jagan : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తన లక్ష్యమని సిఎం జగన్ అన్నారు. నాలుగు మంచి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మూల పేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు రూ. 4362 కోట్లు, బుడగట్లపాలేం ఫిషింగ్ హార్బర్ కు రూ.366 కోట్లు, హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోజేక్ట్ కు రూ.176 కోట్లు, మహేంద్ర తన ఆప్ షోర్ పనుల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. విస్తారమైన సముద్ర తీరం ఉన్నా ఇప్పటివరకు ఓ పోర్ట్, ఫిషింగ్ హార్బర్ లేదన్నారు. దశాబ్దాలుగా ఎవ్వరూ.. జిల్లాలో ఏర్పాటు చేయలేదని వెల్లడించారు.

జిల్లా ముఖ చిత్రం మార్చేందుకు తపన పడుతూ అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంలో మూలపేట పోర్ట్, బుడగట్ల పాలేంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మూల పేట, విష్ణు చక్రం… రాబోయే రోజుల్లో మరో చెన్నై, ముంబై కాబోతున్నాయని అభివర్ణించారు. 24 నెలలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. పోర్టును హైవే, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. 0.5MLD నీటిని పైప్ లైన్ తో గోట్టా బ్యారేజ్ నుండి తీసుకు రానున్నామని వెల్లడించారు.

Andhra pradesh: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్.. కడప, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు..

1250 ఎకరాల్లో రూ.4362 కోట్లతో పోర్టు నిర్మాణం చేయనున్నామని తెలిపారు. పోర్టుతో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారనుందన్నారు. పోర్టు ద్వారా 35 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు ద్వారా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గంగ పుత్రుల కళ్లల్లో మరింత కాంతి నింపేందుకు ఈ జిల్లాలో మరో రెండు ఫిషింగ్ హార్బర్ లు నిర్మిస్తామని పేర్కొన్నారు. బుడగడ్ల పాలెంతో పాటు మంచి నీళ్ల పేటలో మరో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు.

ఎగుమతులు, దిగుమతుల ద్వారా మరో నగరంగా మారనున్నాయని చెప్పారు. నాలుగేళ్లల్లో రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. గతంలో ఇలా అభివృద్ధి ఏందుకు చేయలేదో ఆలోచన చేయాలన్నారు. వైఎస్ హయాం తరువాత ప్రాజెక్టులు మూల పడిపోయాయని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక… ఒరిస్సా వెళ్లి వంశధార నేరడి బ్యారేజీపై చర్చలు జరిపామని తెలిపారు. సమస్యలు ఉన్నాయని.. దీంతో రూ.176 కోట్లతో గోట్టా బ్యారేజ్ పై లిప్ట్ ఏర్పాటు చేసి వంశధార రిజర్వాయర్ కి నీరు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

AP CM Jagan : పిల్లలను బడికి పంపేలా అమ్మఒడి.. ఇంటర్మీడియట్‌ వరకూ వర్తింపు : సీఎం జగన్

ఆగస్టులో గోట్టా బ్యారేజ్ లిఫ్ట్ ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆగిన మహేంద్ర తనయ ఆప్ షోర్ పనులకు తిరిగి అదనపు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం వాసులకు మంచినీరు ప్రోజేక్ట్ ను జూన్ లోగా పూర్తి చేసి, జూన్ లో వచ్చి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పాతపట్నం నియోజకవర్గంలో మరో 265 గ్రామాలకు వంశధార తాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంద్రాల్లో 4 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని తెలిపారు. మే3న బొగాపురం ఎయిర్ పోర్ట్, ఆ తర్వాత డేటా సెంటర్ కు శంఖుస్థాపన చేస్తున్నామని తెలిపారు. వైజాగ్ నుండి ఎయిర్ పోర్ట్ కు 6 లైన్స్ హైవే నిర్నించనున్నామని పేర్కొన్నారు. విశాఖలో సెప్టెంబర్ నుండి పరిపాలనా రాజధానిలో భాగంగా విశాఖలో కాపురం కూడా పెడతామని స్పష్టం చేశారు. DBt బట్ నోక్కడమే కాదు… ప్రాంతాల చరిత్ర కూడా మార్చడానికి తాను అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

YS Jagan Mohan Reddy : పొత్తులపై సీఎం జగన్ కీలక ప్రకటన

మంచి చేస్తున్నాం కాబట్టి… మంచి చేయలేని వారంతా ఏకం అవుతున్నారని.. తాను ఓక్కరే ఓ వైపు ఉన్నారని తెలిపారు. కొందరు చీకటి యుద్ధం చేస్తున్నారని.. అబద్ధాన్ని నిజమని చెప్పే యుద్ధం చేస్తున్నారని చెప్పారు. పెత్తందారుల టీడీపీకి – పేదలు తరుపున తనకు యుద్ధం జరుగుతుందన్నారు. ఈ యుద్ధంలో మీ చల్లని ఆశీస్సులపై నమ్ముకుందన్నారు. ‘మీ ఇంట్లో మంచి జరిగితే.. మీ బిడ్డకు సైనికుడిగా మీరే కదలండి.. మీ బిడ్డకు దత్తపుత్రుడు లేడు.. టెక్కలి నియోజకవర్గంకు దువ్వాడ శ్రీనివాస్ ని అభ్యర్థిగా మీ ముందు ఉంచుతున్నా.. ఎవరికీ కన్ఫ్యూజన్ ఉండకూడదు అని సీఎం జగన్ అన్నారు.