Home » Ashada Bonalu
అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.
బందోబస్తు విధుల్లో 2 వేల మంది పోలీసులు ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీలో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.
రాష్ట్రంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని..గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి.. శాస్త్రోక్తంగా తొలి బోనం నిన్న సమర్పించారు.
ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో హైదరాబాద్లో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి.