Lal Darwaja Bonalu : ఘనంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు… తొలి బోనం సమర్పించిన ఆలయ కమిటీ

బందోబస్తు విధుల్లో 2 వేల మంది పోలీసులు ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీలో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.

Lal Darwaja Bonalu : ఘనంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు… తొలి బోనం సమర్పించిన ఆలయ కమిటీ

Lal Darwaja Bonalu

Updated On : July 16, 2023 / 7:44 AM IST

Simhavahini Ammavaru : హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున సింహవాహిని అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు తొలి బోనం సమర్పించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో లాల్ దర్వాజా బోనాల జాతర ప్రారంభం అయింది. సింహవాహిని అమ్మవారికి దర్శనానికి సీఎస్, రాష్ట్ర మంత్రులు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

హోంమంత్రి మహ్మద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సింహవాహిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

Swarnalatha Rangam Bhavishyavani : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు.. స్వర్ణలత రంగం భవిష్యవాణి

బందోబస్తు విధుల్లో 2 వేల మంది పోలీసులు ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీలో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి 115 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బందోబస్తు ఏర్పాట్లు పెరిగాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తులకు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో హైదరాబాద్ లో ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పాతబస్తీతోపాటు చుట్టు పక్కల సుమారుగా 150కి పైగా చిన్నా పెద్ద దేవాలయాలు బోనాల పండుగకు ముస్తాబు అయ్యాయి.

Ujjaini Mahankali Bonalu 2023 : వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబం బోనం సమర్పించింది. దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ దంపతులు అమ్మవారి ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు. అమ్మవారి పూజల నేపథ్యంలో సామాన్యుల దర్శనం ఆలస్యమవుతుంది. భక్తులు మూడు గంటల పాటు లైన్ లో వేచి ఉన్నారు. భక్తులకు అమ్మవారి దర్శనం ప్రారంభమైంది.