Swarnalatha Rangam Bhavishyavani : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు.. స్వర్ణలత రంగం భవిష్యవాణి

భవిష్యవాణి వినడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు చేసిన పూజలతో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. సంతోషంగా, ఆనందంగా పూజలు అందుకున్నానని పేర్కొన్నారు.

Swarnalatha Rangam Bhavishyavani : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు.. స్వర్ణలత రంగం భవిష్యవాణి

Swarnalatha Rangam Bhavishyavani (1)

Secunderabad Ujjaini Mahankali Bonalu : హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం మొదటైంది. సోమవారం ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భవిష్యవాణి వినడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు చేసిన పూజలతో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. సంతోషంగా, ఆనందంగా పూజలు అందుకున్నానని పేర్కొన్నారు.

ఎటువంటి లోపం లేకుండా పూజలు అందుకున్నామని తెలిపారు. గతేడాది తనకు మాట ఇచ్చి ఎందుకు మరిచి పోయారని అడిగారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, తాను భక్తులతోనే ఉంటానని చెప్పారు. వర్షాలు వస్తాయి, కానీ కొంచెం ఒడిదుడుకు అవుతుందన్నారు. అగ్ని ప్రామాదాలు జరుగుతాయని తెలిపారు. తన వద్దకి వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత తనదేనని అన్నారు.

Ujjain Mahankali Bonalu: అట్టహాసంగా లష్కర్‌ బోనాలు.. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు

ఐదు వారాలపాటు తనను ముత్తైదులందరూ భక్తిశ్రద్ధలతో కొలుచుకోవాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చెప్పారు. ఐదు వారాలు తనకు సాక పోయండి నాయన అని అన్నారు. ఇది బయట పెట్టాలో.. పెట్టకూడదో తనకు మాత్రమే తెలుసన్నారు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రమాదలు జరుగుతుంటాయని, ఒడిదుడుకులు ఎదురుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

తన దగ్గరకు వచ్చిన ప్రజలు సంతోషంగా ఉండేలా, ఎవరికి ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. ఐదు రోజుల పాటు సాకలు అందించి, నైవేద్యాలు పెట్టి, పూజలు చేస్తే తాను సంతోషంగా ఉంటానని చెప్పుకొచ్చారు. గడప గడపను కాపాడే భారం తనదేనని అన్నారు.

Ujjaini Mahankali Bonalu 2023 : వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

ప్రజలు చేసిన క్రియాలన్నీ కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి, చెప్పవని ఉంటాయని… ఇవ్వని కడుపులో దాచుకొనేది తానేనని పేర్కొన్నారు. తప్పనిసరిగా వాటిని తనలోనే దాచుకుంటానని చెప్పారు. భక్తులు చేసే పూజలు అందుకుంటాను.. వచ్చే ఏడాది అన్ని పూజలు జరిపించండి అంటూ భవిష్యవాణి వినిపించారు.