Ujjain Mahankali Bonalu: అట్టహాసంగా లష్కర్‌ బోనాలు.. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు

సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అరంరంగవైభవంగా జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Ujjain Mahankali Bonalu: అట్టహాసంగా లష్కర్‌ బోనాలు.. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు

Ujjain Mahankali Bonalu

Updated On : July 9, 2023 / 3:03 PM IST

Ujjain Mahankali: సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగవైభవంగా కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారు జాముు నుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలిపూజ అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలిబోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకొనేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.  రాజకీయ ప్రముఖులు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత పలువురు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.