భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేత

భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేత

Lal Darwaza Ashada Bonalu

Minister Komatireddy Venkatreddy : తెలంగాణ ఆషాఢమాస బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీసులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవటం జరిగిందని తెలిపారు. గతేడాది వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు.. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పటికే వర్షాలు సమృద్ధిగా పడ్డాయని, రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు. ప్రభుత్వం 11లక్షల మంది రైతులకు 7వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగిందని, వారం రోజుల్లో 15వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారబోతుందని అన్నారు.

Also Read : HMDA Allocations : హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై సర్కార్‌ ఫోకస్‌