Home » Badwel By-election
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. పట్టణ శివార్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఏపీలోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికలో 68.37శాతం ఓటింగ్ నమోదైంది. అయితే గత ఎన్నికల్లో కంటే ఈ సారి 8.25శాతం తక్కువ నమోదైంది. మంగళవారం ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించారు.
ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు.
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏపీ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని తెలిపారు.
బద్వేల్ ఉప ఎన్నికలో 9 నామినేషన్లను తిరస్కరించారు. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీతో పాటు 18 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. ఉపసంహరణకు ఈ నెల 13వ తేదీ వరకు గుడువు ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 30న జరుగనున్న హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతోంది. వచ్చిన నామినేషన్లను ఉదయం 10 గంటల నుంచి అధికారులు పరిశీలిస్తున్నారు.
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై వైసీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ నామినేషన్ దాఖలు చేశారు.
వైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలే బద్వేల్ ఉప ఎన్నికలో తనను గెలిపిస్తాయని అభ్యర్థి డాక్టర్ సుధ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.