Badwel By-Election : బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా సుధ నామినేషన్

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికపై వైసీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ నామినేషన్‌ దాఖలు చేశారు.

Badwel By-Election : బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా సుధ నామినేషన్

Sudha

Updated On : October 5, 2021 / 7:51 AM IST

Sudha nomination as YCP candidate : కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికపై వైసీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ నామినేషన్‌ దాఖలు చేశారు. గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. ప్రజలందరూ తమ పార్టీ వైపే ఉన్నారన్నారు.

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నిక సహా 2024 జనరల్‌ ఎలక్షన్స్‌ లోపు జరిగే అన్ని ఎన్నికలను రిహార్సల్‌గా తీసుకోవాలని వైసీపీ నిర్ణయించింది. బద్వేల్‌ ఉప ఎన్నిక ఏకగ్రీవం కాకపోతే.. ఏ పార్టీ పోటీలో ఉన్నా వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపు ఇచ్చింది. ప్రజలందరూ వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధకు మద్దతుగా నిలవాలని వైసీపీ ముఖ్యనేతల సమావేశం కోరింది.

Telugu Desam Party: బద్వేల్ బరిలోంచి తప్పుకున్న తెలుగుదేశం

ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయగా.. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. అయితే, జనసే మిత్రపక్షం బీజేపీ మాత్రం తగ్గేదే లేదు.. మేం పోటీ చేస్తాం అంటోంది.

కుటుంబ రాజకీయాలకు, వారసత్వ పదవులకు వ్యతిరేకం అని చెబుతున్న భారతీయ జనతా పార్టీ బద్వేల్ ఉపఎన్నిక బరిలో నిలుస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బద్వేల్ ఎన్నిక ఏకగ్రీవం కానట్లేననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బద్వేల్ ఉపఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ బద్వేలు ఉపఎన్నికల్లో అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మను ఇప్పటికే ప్రకటించారు.

Badvel By-Election: బద్వేల్‌లో సమరానికి బీజేపీ సై! ఏకగ్రీవం కానట్లేనా?

ఈ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు కొవిడ్‌-19 ఆంక్షలతో పరిమిత సంఖ్యలోనే ప్రజలు, నాయకులు హాజరు కావాల్సి ఉంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు 8వ తేది వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.