Badvel By-Election: బద్వేల్‌లో సమరానికి బీజేపీ సై! ఏకగ్రీవం కానట్లేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేల్ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది.

Badvel By-Election: బద్వేల్‌లో సమరానికి బీజేపీ సై! ఏకగ్రీవం కానట్లేనా?

Badvel Bypoll

Updated On : October 4, 2021 / 9:45 AM IST

Badvel By-Election: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేల్ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయగా.. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. అయితే, జనసే మిత్రపక్షం బీజేపీ మాత్రం తగ్గేదే లేదు.. మేం పోటీ చేస్తాం అంటోంది.

కుటుంబ రాజకీయాలకు, వారసత్వ పదవులకు వ్యతిరేకం అని చెబుతున్న భారతీయ జనతా పార్టీ బద్వేల్ ఉపఎన్నిక బరిలో నిలుస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బద్వేల్ ఎన్నిక ఏకగ్రీవం కానట్లేననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బద్వేల్ ఉపఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ బద్వేలు ఉపఎన్నికల్లో అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మను ఇప్పటికే ప్రకటించారు.

ఈ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుధాను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నామినేషన్ల దాఖలుకు కొవిడ్‌-19 ఆంక్షలతో పరిమిత సంఖ్యలోనే ప్రజలు, నాయకులు హాజరు కావాల్సి ఉంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు 8వ తేది వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.