Telugu Desam Party: బద్వేల్ బరిలోంచి తప్పుకున్న తెలుగుదేశం
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకుంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.

Badwel
Telugu Desam Party: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకుంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ. బద్వేల్ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబం నుంచే వైసీపీ అభ్యర్ధిని బరిలోకి దిగుతోండగా.. సాంప్రదాయం ప్రకారం పోటీ చెయ్యకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది తెలుగుదేశం.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన పోలిట్‌బ్యూరో సమావేశంలో ఈమేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. గత సంప్రదాయాల ప్రకారంగా కుటుంబ సభ్యులనే నిలపామని, ఇతర పార్టీలు ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధులను దింపొద్దని టీడీపీ సహా ఇతర పార్టీలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
అనారోగ్య కారణాలతో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య చనిపోగా.. ఈ స్థానంకి ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో.. మృతి చెందిన కుటుంబానికి అధికార పార్టీ సీటు ఇచ్చింది. జనసేన అధినేత పవన కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకూడదని నిర్ణయించినట్లు ప్రకటించారు.