YCP Candidate Sudha : వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి : డా.సుధ
వైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలే బద్వేల్ ఉప ఎన్నికలో తనను గెలిపిస్తాయని అభ్యర్థి డాక్టర్ సుధ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.

Sudha
Badwel YCP candidate Dr. Sudha : వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే బద్వేల్ ఉప ఎన్నికలో తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తామన్నారు. ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం 4 వందల కోట్లు కేటాయించారన్నారు.
ఇక బద్వేల్ మున్సిపాలిటీకి 120 కోట్లు కేటాయించారన్నారు. 2019 ముందు బద్వేల్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఈ రెండేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ సంపాధిస్తామని తెలిపారు.
CM Jagan : దాసరి సుధ గెలుపు కోసం అందరూ పనిచేయాలి : సీఎం జగన్
బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థిగా డా.దాసరి సుధను వైసీపీ ఎంపిక చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన బద్వేల్ ఎమ్మెల్యే డా.దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28న మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగబోతుంది. దీంతో డాక్టర్ వెంటకసుబ్బయ్య సతీమణి డా.సుధను పార్టీ అధిష్టానం బద్వేల్ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
బద్వేల్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. అక్టోబర్ 1 న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.