Home » COVID Sub-Variant
ప్రస్తుతం ముగ్గురు రోగులు మా ఐసోలేషన్ వార్డులో వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్ అయ్యారు. కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించాము. ముగ్గురు రోగుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.
2 రోజుల వ్యవధిలో నిలోఫర్ లో రెండు కేసులు వెలుగుచూడటం కలవర పెడుతోంది. 15 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో పసికందు బాధపడుతోందని డాక్టర్లు తెలిపారు.
కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ BA 2.75 ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది. ఇజ్రాయెల్ నిపుణుల ప్రకారం.. దాదాపు 10 రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇండియన్ హెల్త్ మినిష్ట్రీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.