Covid Death : కోవిడ్‌తో కాదు హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయాడు- ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ క్లారిటీ

ప్రస్తుతం ముగ్గురు రోగులు మా ఐసోలేషన్ వార్డులో వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్‌ అయ్యారు. కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించాము. ముగ్గురు రోగుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.

Covid Death : కోవిడ్‌తో కాదు హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయాడు- ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ క్లారిటీ

Covid Death (Photo : Google)

Updated On : December 26, 2023 / 5:43 PM IST

తెలంగాణలో కరోనాతో ఓ వ్యక్తి చనిపోయాడు అంటూ వస్తున్న వార్తలపై హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ స్పందించారు. అది కోవిడ్ మరణం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వ్యక్తి చనిపోయింది కరోనాతో కాదు హార్ట్ స్ట్రోక్ తో అని తేల్చి చెప్పారు. ఇక, కోవిడ్ కొత్త వేరియంట్ JN1 తేలికపాటి లక్షణాలతో కూడిన చాలా తేలికపాటి రూపాంతరం అని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని నాగేందర్ వివరించారు.

”ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో కోవిడ్ కారణంగా ఓ పేషెంట్ చనిపోయాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది నిజం కాదు. రోగి ఎండీ సుభాన్(60) బండ్లగూడ, దూద్‌బౌలికి చెందిన వ్యక్తి. టైప్ 2 శ్వాసకోశ వైఫల్యంతో COPD తీవ్రతతో మెడికల్ ఎమర్జెన్సీతో మా అక్యూట్ మెడికల్ కేర్‌లో చేరారు. యాదృచ్ఛికంగా జరిగిన పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది.

అతడు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. కోవిడ్ కారణంగా కాదు. ప్రస్తుతం ముగ్గురు రోగులు మా ఐసోలేషన్ వార్డులో వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్‌ అయ్యారు. కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించాము. ముగ్గురు రోగుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది” అని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ చెప్పారు.

Also Read : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ముగ్గురు మృతి

కాగా, తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించినట్లు వార్తలు వచ్చాయి. ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడని వార్తలు బయటకు వచ్చాయి. అనారోగ్య సమస్యలతో ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరగా, కరోనా టెస్టులు చేశారని, అతడికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో అతడు చనిపోయాడని అన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

కరోనాతో ఒకరు చనిపోయారు అని తెలియడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. ఆ వ్యక్తి చనిపోయింది వాస్తవమే కానీ కరోనాతో కాదు హార్ట్ స్ట్రోక్ తో అని ఆయన స్పష్టం చేశారు.

Also Read : 1994లో విష ప్రయోగం.. ఇప్పుడు మరణం