Woman dies: 1994లో విష ప్రయోగం.. ఇప్పుడు మరణం

మొదట్లో కడుపునొప్పి, జుట్టు ఊడడం వంటి సమస్యలతో బాధపడింది. తర్వాత మెదడు డ్యామేజ్.. కళ్లు కనపడలేదు.. కోమాలోకి వెళ్లిపోయింది.. అప్పుడు..

Woman dies: 1994లో విష ప్రయోగం.. ఇప్పుడు మరణం

Beijing's Tsinghua University

Updated On : December 24, 2023 / 5:06 PM IST

China: చైనాకు చెందిన ఓ మహిళపై 1994లో విష ప్రయోగం జరిగింది. అప్పట్లో పక్షవాతానికి గురైంది.. కళ్లు కనపడలేదు.. మెదడు చాలా వరకు పాడైపోయింది.. 50 ఏళ్ల వయసులో ఇప్పుడు ప్రాణాలు కోల్పోయింది. ఆమె పేరు జు లింగ్. 1994లో జు లింగ్.. బీజింగ్ సింగువా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ రసాయన శాస్త్ర విద్యార్థిని.

విషపూరిత రసాయనం థాలియాన్ని ఆమెకు తెలియకుండా ఆమెపై ఎవరో ప్రయోగించారు. మొదట్లో ఆమె కడుపునొప్పి, జుట్టు ఊడడం వంటి సమస్యలతో బాధపడింది. తర్వాత కొన్ని నెలల పాటు కోమాలోకి వెళ్లిపోయింది.

పక్షవాతం వల్ల అప్పటి నుంచి నిన్నటివరకు ఆమె దాదాపు మంచానికే పరిమితమైంది. ఆమెను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఆమెపై విష ప్రయోగం చేసింది ఎవరు? అన్న విషయాన్ని తేల్చేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఆ విషయం ఇప్పటివరకు బయటపడలేదు.

జు లింగ్ క్లాస్‌మెట్, రూమ్‌మెట్ సన్ వెయీని పోలీసులు అనుమానించారు. అయితే, ఏ ఆధారమూ దొరకలేదు. సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించకముందే జు లింగ్ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Jammu and Kashmir : మసీదు వద్ద రిటైర్డు పోలీసు అధికారిపై ఉగ్రవాదుల కాల్పులు…మృతి