Jammu and Kashmir : మసీదు వద్ద రిటైర్డు పోలీసు అధికారిపై ఉగ్రవాదుల కాల్పులు…మృతి
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలో రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్చి చంపారు.....

Retired senior cop shot dead
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలో రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. షీరీ బారాముల్లాలోని గంట్ముల్లాలో రిటైర్డ్ పోలీసు అధికారి అయిన మహ్మద్ షఫీ మసీదులో అజాన్ ప్రార్థనలు చేస్తుండగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
ALSO READ : 2024 Lok Sabha elections : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు
ఈ కాల్పుల్లో గాయాలపాలైన షఫీ మరణించారు. ఈ ఘటనపై కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ లో పోస్టు పెట్టారు. గత నెలలో శ్రీనగర్‌లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.
ALSO READ : Ayodhya : అయోధ్యలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
శ్రీనగర్‌లోని ఈద్గా మైదానంలో ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీ స్థానిక యువకులతో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. జమ్మూకశ్మీరులో తరచూ ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ఉగ్రవాదుల చొరబాట్లతోపాటు వారి సంచారం పెరగడంతో కేంద్ర భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి గాలింపును ముమ్మరం చేశాయి.