2024 Lok Sabha elections : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు

రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు అధికార బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 50 శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జనవరి 15వతేదీ తర్వాత బీజేపీ క్లస్టర్ సమావేశాలను ప్రారంభించనుంది....

2024 Lok Sabha elections : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు

BJP Meeting

Updated On : December 24, 2023 / 8:02 AM IST

2024 Lok Sabha elections : రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు అధికార బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 50 శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జనవరి 15వతేదీ తర్వాత బీజేపీ క్లస్టర్ సమావేశాలను ప్రారంభించనుంది. భారతీయ యువమోర్చా దేశవ్యాప్తంగా 5వేల సదస్సులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు నిర్వహించనుంది.

ALSO READ : Ayodhya : అయోధ్యలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు బీజేపీ వ్యూహాన్ని రూపొందించారు. కొత్త ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనుంది. కొత్త ఓటర్లతో అనుసంధానం చేసేందుకు బీజేపీ బూత్ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.

ALSO READ : JN.1 Covid variant : దేశంలో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ మరింత వ్యాప్తి…ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడి

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశంలో బీజేపీ కార్యకర్తలందరినీ కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభలను క్లస్టర్లుగా విభజించి క్లస్టర్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్లస్టర్లలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. జనవరి 24వతేదీన యువమోర్చా కొత్త ఓటరు సదస్సులను ప్రారంభించనుంది.

ALSO READ : Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

బీజేపీ యువమోర్చా దేశవ్యాప్తంగా 5వేల సదస్సులు నిర్వహించనుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా సామాజిక సదస్సులు కూడా నిర్వహించనున్నారు. జనవరి 1వతేదీ నుంచి రామమందిర ఉత్సవాల ప్రచారాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది, ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పది కోట్ల కుటుంబాలను రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు.