Ayodhya : అయోధ్యలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ అయోధ్య నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అయోధ్య నగర కమిషనర్ గౌరవ్ దయాల్ చెప్పారు....

Ayodhya airport,railway station
Ayodhya : పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ అయోధ్య నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అయోధ్య నగర కమిషనర్ గౌరవ్ దయాల్ చెప్పారు. ప్రధాని మోదీ అయోధ్య పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు.
ALSO READ : Earthquake : తైవాన్, మేఘాలయలో భారీ భూకంపం
అయోధ్య నగరానికి రోజుకు 50వేల మంది ప్రజలు వస్తారని భావించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రధాని మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించి ఎయిర్ పోర్టు నుంచి అయోధ్య రైల్వేస్టేషను వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ఎయిర్ పోర్టు పక్కన ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని అధికారులు చెప్పారు.
డిసెంబర్ 30వతేదీన ప్రధాని అయోధ్య పర్యటనకు సంబంధించి శనివారం జిల్లా ఉన్నతాధికారులతో పాటు రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 21, 22 తేదీల్లో భక్తులకు రామ్‌లల్లా దర్శనం ఉండదని, జనవరి 23 నుంచి దర్శనం ప్రారంభమవుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. చార్టర్డ్ విమానాల్లో చాలా మంది అతిథులు వస్తారని అంచనా వేశారు.
ALSO READ : Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?
ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్,వరణాసి వంటి జిల్లాల్లో విమానాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1వతేదీ నుంచి రామమందిర ఉత్సవాల ప్రచారాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది, ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు.