JN.1 Covid variant : దేశంలో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ మరింత వ్యాప్తి…ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడి
దేశంలో కొవిడ్ జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ జేఎన్ 1 సబ్ వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం కాదని ఆయన పేర్కొన్నారు....

JN.1 Covid variant
JN.1 Covid variant : దేశంలో కొవిడ్ జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ జేఎన్ 1 సబ్ వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం కాదని ఆయన పేర్కొన్నారు. ‘‘ కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ యూఎస్, యూరప్ దేశాల్లో ఆధిపత్య వేరియంట్ గా మారుతుందని, భారతదేశంలోనూ ఈ సబ్ వేరియంట్ కేసులు ఎక్కువగా ప్రబలుతాయి’’ అని సీనియర్ పల్మోనాలజిస్ట్ అయిన గులేరియా చెప్పారు.
ALSO READ : Earthquake : తైవాన్, మేఘాలయలో భారీ భూకంపం
ఈ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ సోకినా రోగులు ఆసుపత్రిలో చేరడం లేదని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు చేతులు క్రమం తప్పకుండా కడుక్కోవాలని, దగ్గు ద్వారా కొవిడ్ సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులున్న వారు, వృద్ధులు ఫేస్ మాస్కుులు ధరించాలని డాక్టర్ రణదీప్ గులేరియా కోరారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ముక్కు కారటం, శరీర నొప్పులు కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ లక్షణాలని డాక్టర్ చెప్పారు. జేఎన్ 1 సబ్ వేరియంట్, ఓమైక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న వైరస్ లని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ మొదటి కేసు కేరళలోని 79 ఏళ్ల మహిళకు వచ్చింది. కేరళ, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఈ కొత్త సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.