Earthquake : తైవాన్, మేఘాలయలో భారీ భూకంపం
తైవాన్, మేఘాలయ ప్రాంతాల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాభా ఉన్న తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీపంలోని వాతావరణ బ్యూరో తెలిపింది....

Earthquake
Earthquake : తైవాన్, మేఘాలయ ప్రాంతాల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాభా ఉన్న తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీపంలోని వాతావరణ బ్యూరో తెలిపింది. భూకంప కేంద్రం తైవాన్‌లోని టైటుంగ్ కౌంటీకి సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ బ్యూరో పేర్కొంది.
ALSO READ : RGV Vyooham: వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్లో మంత్రులు రోజా, అంబటి, జోగి రమేశ్ ఏమన్నారో తెలుసా?
గ్రామీణ ప్రాంతాల్లోని కౌంటీలో భూమి కంపించింది. తైవాన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షను సమీపంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే తైవాన్ రాజధాని తైపీలో మాత్రం భూకంపం రాలేదు. మేఘాలయ ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ రీజియన్ లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.
ALSO READ : Fire Accident : గుడి మల్కాపూర్ అంకుర ఆస్పత్రిలో మంటలు
శనివారం రాత్రి 7.25 గంటలకు అయిదు కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలోని వారు బయట రోడ్లపైకి పరుగులు తీశారు.