Covid Cases in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ముగ్గురు మృతి
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Covid Cases in India
Covid -19 News Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 4170 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 122 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 3096 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రాలలో యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
Also Read : India Covid 19 Cases : మళ్లీ దడ పుట్టిస్తున్న కరోనా
తెలంగాణలో 10 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో కొత్తగా ఆరు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే తమిళనాడు రాష్ట్రంలో 11, కర్ణాటక రాష్ట్రంలో 122 కొత్త కేసులు నమోదయ్యాయి. జేఎన్.1 కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.