Home » CPI National Secretary Narayana
దేశంలో నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, బ్రిటిష్ పాలనను గుర్తు చేసేలా మోదీ పాలన ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చిపెట్టాయి. బీఆర్ ఎస్ ఎక్కడా డిపాజిట్లు కోల్పోలేదని నారాయణ అన్నారు.
ఇండియా కూటమి బలపడటం వల్ల బీజీపీని నిలవరించవచ్చని పేర్కొన్నారు. ఊహాగానాలను తాము నమ్మబోమని తెలిపారు.
ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి డబ్బులు పంచుతుందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఏపీ ప్రజలకు బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. పవన్, చంద్రబాబులు మునిగిన పడవలపై ఉన్నారని తెలిపారు. పవన్, చంద్రబాబులు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర హోం శాఖ నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. కేంద్ర హోంమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసీఆర్ని లొంగదీసుకోవడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని నారాయణ అన్నారు.