ఆంధ్ర, తెలంగాణ సీఎంల భేటీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

దేశంలో నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, బ్రిటిష్ పాలనను గుర్తు చేసేలా మోదీ పాలన ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

ఆంధ్ర, తెలంగాణ సీఎంల భేటీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

CPI National Secretary Narayana

CPI National Secretary Narayana : దేశంలో నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు పెడతున్నారని, బ్రిటిష్ పాలనను గుర్తు చేసేలా మోదీ పాలన ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తున్నారు. సెంటిమెంటల్ గా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థలను బ్రష్టు పట్టించారంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై నారాయణ స్పందించారు. ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవడం హర్షణీయం. రెండు రాష్ట్రాల సమన్వయం అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. దీనికి సీపీఐ కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కేంద్రంతో మాట్లాడాలని నారాయణ అన్నారు. ప్రత్యేక హోదాకోసం చంద్రబాబు పట్టుబట్టాలి. ప్రత్యేక హోదాతప్ప మరో మార్గం లేదు.. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో వెనక్కుతగ్గితే మేము పోరాటం చేస్తామని నారాయణ తెలిపారు.

Also Read : ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు.. తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించిన సాయం కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి అభివృద్ధితో పాటు ఇతర విషయాలను కేంద్రంతో ప్రస్తావించాలని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం అందించాలి. గతంలో కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. మౌలిక సమస్యలు, హామీలపై ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల అంశాలను గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి కేంద్రంతో చర్చించాలి. ముందుగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని రామకృష్ణ అన్నారు.