Narayana : ప్రైవేట్ సైన్యంతో అధికార దుర్వినియోగం.. అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం ఐఏఎస్, ఐపీఎస్ లను అవమానించడమే : నారాయణ

ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి డబ్బులు పంచుతుందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందన్నారు.

Narayana : ప్రైవేట్ సైన్యంతో అధికార దుర్వినియోగం.. అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం ఐఏఎస్, ఐపీఎస్ లను అవమానించడమే : నారాయణ

CPI National Secretary Narayana

Updated On : October 10, 2023 / 1:54 PM IST

Narayana – Government Power Misuse : ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకోని అధికార దుర్వినియోగానికి పాలడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఇవ్వాలానుకుంటే ఆరు నెలల ముందు ఇచ్చి అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి డబ్బులు పంచుతుందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు.

మంగళవారం నారాయణ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న కేంద్ర ఈసీఐ అధికారి ఎక్కడో ఉంటే ఫస్ట్ ప్లేస్ కి వచ్చారని తెలిపారు. ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకోని అధికార దూర్వినియోగానికి పాలడుతున్నారని విమర్శించారు. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో సీపీఐ, సీపీఎం కలిసి బలమైన స్థానాల్లో పోటీ చేస్తున్నాయని తెలిపారు.

Vishnu Kumar Raju టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?

ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో కాకుండా వామపక్షాలు విడిగా పోటీ చేస్తున్నాయని చెప్పారు. సీట్లు ఇవ్వమంటే తాము ఊరికే ఉండబోమని బలమైన స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. కాంగ్రెస్ దగ్గర సీపీఐ, సీపీఎం నుంచి చెరో 5 సీట్ల చొప్పున ప్రతిపాదన పెట్టామని తెలిపారు. రాజకీయ అవగాహన కుదిరిందని.. సీట్ల అవగాహన కుదరలేదన్నారు.

సీట్ల అంశంపై ఇంకా క్లారిటి రాలేదని చెప్పారు. చట్ట సభల్లో తమ వాయిస్ ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థుల లిస్ట్ లో తమ సీట్ల కేటాయింపు అనేది ఉంటుందనే భావనలో ఉన్నామని వెల్లడించారు.