జగన్ ఓటమికి ప్రధాన కారణం అదే.. చంద్రబాబు గుణపాఠం నేర్చుకోవాలి : సీపీఐ నారాయణ
తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చిపెట్టాయి. బీఆర్ ఎస్ ఎక్కడా డిపాజిట్లు కోల్పోలేదని నారాయణ అన్నారు.

CPI National Secretary Narayana
CPI National Secretary Narayana : ఏపీలో ఎన్నికల ఫలితాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కీలక వ్యాఖ్యలపై చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగా జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాలి. జగన్ ఇంటికి వెళ్లి పూలబొకేతో విష్ చేయాలి. అందరికంటే జగన్ ఎక్కువ కష్టపడ్డారని నారాయణ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వామపక్షాల ఓట్ల శాతం పెరిగింది. పరిమితమైన సంతృప్తిలో ఉన్నాం. ఏపీలో ఎవరికి అంతుపట్టని ఫలితాలు వచ్చాయన్న నారాయణ.. గెలిచిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకత కూటమికి కలిసి వచ్చిందని అన్నారు.
Also Read : పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటా.. జగన్ విషయంలో మాత్రం బాధగాఉంది : ముద్రగడ
ఎన్డీయేలో చంద్రబాబు కీలకం..
మోదీకి చంద్రబాబు, నీతిశ్ కుమార్ లేకపోతే మోదీ ప్రధాని కాలేడు. కచ్చితమైన ప్రతిపాదన చంద్రబాబు కేంద్ర వద్ద పెట్టాలని, విభజన హామీలు నెరవేర్చుకోవాలి, ఏపీకి ఫండ్స్ ఇప్పించుకోవాలని నారాయణ సూచించారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేలా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకోసం పని చేయాలి. జగన్ పరిపాలన.. చంద్రబాబు గుణపాఠంగా చూడాలని నారాయణ అన్నారు. హైదరాబాద్ మీద చంద్రబాబు ఆశలు పెట్టుకోకుండా ఏపీ రాజధానిపై ఫోకస్ పెట్టాలి. పంతాలు పట్టింపులకు పోకుండా అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని నారాయణ సూచించారు.
Also Read : పాలకుడనే వాడు ఎలా ఉండకూడదో జగన్ చూపించాడు.. ఎన్డీయేలో కొనసాగే విషయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జగన్ అందుకే ఓడిపోయాడు..
సంక్షేమ పథకాల ద్వారా.. అధికారం వస్తుందనుకోవడం తప్పు. అభివృద్ధి ద్వారా వస్తుందన్న విషయాన్ని జగన్ గుర్తించ లేకపోయాడు. జగన్ ఐదేళ్లు సంక్షేమ పాలనచేస్తే ఓట్లు ఎందుకు కొనుకున్నాడని నారాయణ ప్రశ్నించారు. నిరంకుశ పాలన కారణంగానే జగన్ అధికారం కోల్పోయాడు. చదువుకున్న వాడు అనుకున్నాం. కానీ, తప్పులు చేశాడు.
కాంగ్రెస్ వామపక్షాలకు అన్యాయం చేసింది ..
తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చిపెట్టాయి. బీఆర్ యస్.. బీజేపీకి ఓట్లు పోలరైజ్ కాలేదు. బీఆర్ ఎస్ ఎక్కడా డిపాజిట్లు కోల్పోలేదు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యత లేదు. కాంగ్రెస్ వామపక్షాలకు అన్యాయం చేసింది. బిఆర్.యస్ పార్టీ వారికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి తప్పు చేసింది. ఎక్కడైతే బిఆర్ ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారో వాళ్ళే ఓడిపోయారని నారాయణ అన్నారు.