Home » Current Political Scenario
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిమ్మకూరులోనే ప్రారంభించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు స్కెచ్ రెడీ చేస్తున్నారని చెబుతున్నారు.
నగరిలో టీడీపీ, జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన టీడీపీ, జనసేన ఈ సారి కలిసి పోటీ చేస్తే ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉందంటున్నారు.
సనత్‌నగర్‌లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా మారితే రాజకీయ సమీకరణలు కూడా మారే చాన్స్ కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌పై ఫోకస్ పెంచారు. ఈసారి.. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఇక.. బీజేపీకి కొడంగల్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది.
పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాకమీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరుగుతుంది.
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ తనకు తాను తప్పుకుంటే తప్పా మరో అభ్యర్థి గెలిచే అవకాశం లేనట్లు మారింది పరిస్థితి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీటీ మళ్లీ ఎంఐఎంను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు.
బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోతే.. మంథని రాజకీయం మరింత రక్తి కట్టొచ్చు. ప్రస్తుతానికి పుట్టా మధు, నారాయణరెడ్డి పోటాపోటీగా తిరుగుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం.. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు.
గత రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ను ఈసారి ఓడించి.. తన పాత కోటలో మళ్లీ పాగా వేయాలని చూస్తోంది కాంగ్రెస్.. ఒకప్పుడు నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ పటిష్టంగా ఉండేది.