Home » Gossip Garage
ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే... రెండు జాతీయ పార్టీల జంక్షన్లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కు క్యాడర్ ను నిలుపుకోవడం సవాల్ గా మారింది. గతంలో ఆయన తండ్రి విద్యాసాగర్ రావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడంతో సంజయ్ కు చాన్స్ వచ్చింది.
ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజాదర్బార్ కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్... కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కొక తప్పదంటున్నారు.
అప్పట్లో మహేశ్వర్‌రెడ్డితో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నిహితంగా మెలిగేవారు. వీరి గ్రూపులో మొత్తం 9 మంది ఉండగా, అందులో మహేశ్వర్‌రెడ్డి తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్‌లో ఉండిపోయారు.
అధికారం పోయిన నెల రోజులుకే ఈ పరిస్థితి ఎదురైతే.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుండటమే హైలెట్‌గా నిలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందంటున్నారు. రాజకీయాల్లో గిరి ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనమయ్యారు అంటున్నారు పరిశీలకులు.
ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్... కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది.
బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సివుంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్‌ను చేరుకోడానికి 16 మంది చేరాల్సివుంది.
ఆ నేత కుటుంబ సభ్యులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లే కాలిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.