Home » Jubilee Hills
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రిలీజ్ చేసిన ఆధారాల్లోని ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలించారు. ఈ వీడియోపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటన్నారు. ఒపీనియన్ వచ్చాక.. ఆ ఆధారాలను బేస్ చేసుకుని.. మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేర్చే యోచనలో పో�
టీఆర్ఎస్, మజ్లిస్ నేతల బరితెగింపులకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. కేసును నీరుగార్చేందుకు సీఎంవో కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
కేసులో కీలకంగా మారిన ఇన్నోవా కారు.. గవర్నమెంట్ వెహికల్‌గా టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే ఆ కారు హైదరాబాద్‌లో తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మనే.. ఆ కారు వాడుతున్నట్లు గుర్తించారు.
మరోవైపు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఏ-2 సాదుద్దీన్ మాలిక్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లను రిమాండ్‌కు పంపారు. ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. అమ్నేషియా పబ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నారు.
బాలిక గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో ఇన్నోవా కారు కీలకంగా మారింది. బెంజ్ కారు దొరికినా.. ఇన్నోవా కారు ఇప్పటికి ఎక్కడుందనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో కారు అదృశ్యంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ, హైదరాబాద్ సీపీని కోరారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొదని సూచించారు.
బాలికపై లైంగికదాడి కేసులో.. ఐదుగురి ప్రయేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులపై పోక్సో చట్టం.. ఐపీసీ 323, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జూబ్లిహిల్స్ , బంజారాహిల్స్, పంజాగుట్ట, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ లో వర్షం పడింది. భగ భగ మండుతున్న హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది.
కారు ప్రమాదంలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్‌ను నిమ్స్ నుంచి తరలించింది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.