Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు..ఆ ఎమ్మెల్యే కొడుకు ఎక్కడ?
మరోవైపు బెంజ్ కార్ వీడియో చూశాక.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎమ్మెల్యే కొడుకు వైపు తిరిగినట్లు తెలుస్తోంది. అతడ్ని కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు మరోసారి బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు.

Police Investigation
Jubilee Hills girl rape case : జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో విచారణ వేగవంతం అయింది. ఈ కేసులో ఐదుగురు నిందితులతోపాటు ఇంకా ఎవరెవరున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక గ్యాంగ్ రేప్ కేసుతో ఓ ఎమ్మెల్యే కొడుకుకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే రఘునందన్ బయటపెట్టిన ఆధారాల్లోని ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలించారు. ఈ వీడియోపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటన్నారు. ఒపీనియన్ వచ్చాక.. ఆ ఆధారాలను బేస్ చేసుకుని.. మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేర్చే యోచనలో పోలీసులున్నారు. ఎమ్మెల్యే కొడుకు పేరు చేరిస్తే ఈ కేసులో నిందితుల సంఖ్య 6కు చేరుకుంటుంది. అయితే, ఆ అమ్మెల్యే కొడుకు ఎక్కడ అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు.
ఆ ఎమ్మెల్యే కొడుకు ఎక్కడా? బీజేపీ బయటపెట్టిన వీడియోల్లో ఉన్నది అతడేనా? బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడా? అరెస్ట్ తప్పదనే అజ్ఞాతంలో ఉన్నాడా? తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడు? కనీసం మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వలేడా? నా కొడుకు తప్పు చేయలేదంటూ ఆ ఎమ్మెల్యే ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ పార్టీ వాళ్లు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? హోంమంత్రి మనవడిపై ఆరోపణలు వస్తే.. అతడు మీడియాకు వివరణ ఇచ్చుకున్నాడు. తన తప్పేం లేదని.. పోలీసుల విచారణకు సహకరిస్తానని ముందుకొచ్చాడు. ఇదే పని ఎమ్మెల్యే కొడుకు కానీ.. అతడి తండ్రి కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంతకీ.. అతడు ఇండియాలోనే ఉన్నాడా? విదేశాలకు వెళ్లిపోయాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు ముసురుకుంటున్నాయి.
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ.. ఈ కేసుకు ఇక్కడితో ఎండ్‌కార్డ్ పడేలా కనిపించట్లేదు. తప్పు చేసింది ఐదుగురే అని ఖాకీలు చెప్తున్నా.. ప్రతిపక్షాలన్నీ ఇంకో యువకుడి వైపు వేళ్లు చూపిస్తున్నాయి. అతడ్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. అతడు ఓ ఎమ్మెల్యే కొడుకు. బాలికపై అఘాయిత్యం చేసిన వాళ్లలో ఆ యువకుడు కూడా ఉన్నాడంటూ బీజేపీ నేతలు మొదట్నుంచీ ఆరోపిస్తున్నారు. పోలీసులు అతడ్ని తప్పిస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ మాత్రం.. ఈ కేసుతో ఆ ఎమ్మెల్యే కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
కానీ.. కథ అక్కడితో ముగిసిపోలేదు. ఆ మరుసటి రోజే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియా ముందుకొచ్చారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు. బెంజ్ కారులో బాధిత యువతితో ఎమ్మెల్యే కొడుకు అసభ్యకర స్థితిలో వున్న వీడియోల్ని బయటపెట్టారు. ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలంటూ పోలీసుల్ని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడందరి కళ్లు ఖాకీలవైపే చూస్తున్నాయి. ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేస్తారా? చేయరా? అసలా వీడియోలో ఉన్నది అతడో, కాదో ఎందుకు చెప్పట్లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Girl Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో విచారణ వేగవంతం
మరోవైపు బెంజ్ కార్ వీడియో చూశాక.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎమ్మెల్యే కొడుకు వైపు తిరిగినట్లు తెలుస్తోంది. అతడ్ని కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు మరోసారి బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కొడుకు పేరును ఎఫ్‌ఐఆర్‌లో ఏ-6గా పెట్టే అవకాశముంది. ఇక ప్రతిపక్షాలు మాత్రం ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయకుండా.. పోలీసులు ఒత్తిళ్లు ఉన్నాయంటున్నారు. అదే నిజమైతే.. పోలీసులపై ప్రెజర్ పెడుతోంది ఎవరు?
మరోవైపు ఘటన జరిగిన రోజు బేకరీ దగ్గర ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడు. ఆ తర్వాత ఫోన్‌కాల్ రావడంతో వెళ్లిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బీజేపీ బయటపెట్టిన వీడియాల్లోనూ అతడు కనిపించాడు. ఆ రోజు అతడు ఏ తప్పూ చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కొడుకు హైదరాబాద్‌లోనే ఉన్నాడో, లేడో కూడా క్లారిటీ లేదు. అతడ్ని ఇప్పటికే విదేశాలకు పంపించారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Rape On Girl : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంజ్ కారు, ఇన్నోవా వాహనంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ రెండు గంటలు ఏం జరిగిందనేదానిపై పోలీసులు దృష్టి సారించారు.