Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో ఆ ఎమ్మెల్యే కొడుకు? బీజేపీ బయటపెట్టిన వీడియోలో ఉన్నది అతడేనా?

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రిలీజ్‌ చేసిన ఆధారాల్లోని ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలించారు. ఈ వీడియోపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటన్నారు. ఒపీనియన్ వచ్చాక.. ఆ ఆధారాలను బేస్ చేసుకుని.. మైనర్‌ అయిన ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేర్చే యోచనలో పోలీసులున్నారు.

Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో ఆ ఎమ్మెల్యే కొడుకు? బీజేపీ బయటపెట్టిన వీడియోలో ఉన్నది అతడేనా?

Mla Son

Updated On : June 5, 2022 / 7:05 PM IST

Jubilee Hills girl rape : జూబ్లీహిల్స్‌ బాలిక రేప్‌ కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రిలీజ్‌ చేసిన ఆధారాల్లోని ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలించారు. ఈ వీడియోపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటన్నారు. ఒపీనియన్ వచ్చాక.. ఆ ఆధారాలను బేస్ చేసుకుని.. మైనర్‌ అయిన ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేర్చే యోచనలో పోలీసులున్నారు. ఎమ్మెల్యే కొడుకు పేరు చేరిస్తే ఈ కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరుకుంటుంది.

మరోవైపు.. ఆ అమ్మెల్యే కొడుకు ఎక్కడ అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. ఇంతకీ బీజేపీ బయటపెట్టిన వీడియోల్లో ఉన్నది అతడేనా? బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడా? అరెస్ట్‌ తప్పదనే అజ్ఞాతంలో ఉన్నాడా? తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడు? కనీసం మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వలేడా? నా కొడుకు తప్పు చేయలేదంటూ ఆ ఎమ్మెల్యే ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ పార్టీ వాళ్లు కూడా ఎందుకు మాట్లాడట్లేదు?

Girl Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో విచారణ వేగవంతం

హోంమంత్రి మనవడిపై ఆరోపణలు వస్తే.. అతడు మీడియాకు వివరణ ఇచ్చుకున్నాడు. తన తప్పేం లేదని.. పోలీసుల విచారణకు సహకరిస్తానని ముందుకొచ్చాడు. ఇదే పని ఎమ్మెల్యే కొడుకు కానీ.. అతడి తండ్రి కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంతకీ.. అతడు ఇండియాలోనే ఉన్నాడా? విదేశాలకు వెళ్లిపోయాడా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. ఏ-5 మైనర్ నిందితుడిని కాసేపట్లో పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. మైనర్ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. కేసు విచారణ అధికారిగా ఏసీపీ సుదర్శన్ ను నియమించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Rape On Girl : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..కీలకంగా మారిన ఇన్నోవా కారు ఆచూకీ లభ్యం

తాజాగా అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ కాగా, మరొకరు మైనర్. దీంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్, మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మేజర్ ను చంచల్ గూడ జైలుకి తరలించగా, ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ కేసులో ఏ-2 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన అమ్నేషియా పబ్ ను పోలీసులు క్లోజ్ చేయించారు.