Home » Jupalli Krishna Rao
హుజూరాబాద్ లో ఒక వ్యక్తిని ఓడించేందుకు రూ.2వేల కోట్లతో దళిత బంధు ఇచ్చావు. మరి రాష్ట్రంలో మొత్తం దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేవలం 100 మందికి మాత్రమే దళిత బంధు ఇచ్చారు.
రాష్ట్రంలో అవినీతి పరిపాలన పోవాలంటే వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని బహుమతిగా ఇవ్వాలని జూపల్లి కృష్ణారావు కోరారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో రాహుల్ గాంధీతో వీరు భేటీ కానున్నారు.
పొంగులేటి, జూపల్లి ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీకానున్న నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలకు ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ పక్క గెలుపు కోసం మరోపక్క నేతల చేరికలపై ఫోకస్ పెంచారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పొంగులేటి, జూపల్లితో భేటీ కానున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో చేరిక, వారివెంట ఎవరెవరు వస్తారనే అంశాలపై చర్చించనున్నారు.
మీరు కాంగ్రెస్ లో చేరితే మీరు కోరుకుంటున్నట్లుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని సునీల్ టీమ్ జూపల్లి, పొంగులేటిలతో చర్చలు జరుపుతోంది.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా.. లక్ష్యాలు ఇంకా నెరవేరలేదన్నారు. ప్రజల కోసమే తాము నిరంతరం పోరాడుతామని చెప్పారు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య వివాదం తలెత్తింది.
గులాబీ దళంలో అసంతృప్తుల కలకలం