Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య వివాదం తలెత్తింది.

Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు

Jupali

Updated On : May 21, 2022 / 6:41 PM IST

Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య వివాదం తలెత్తింది. ఇరు వర్గాలు పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బాహాబాహీకి దిగారు. తమ వర్గానికి చెందిన వారినే పోలీసులు ఇబ్బందికి గురిచేస్తున్నారని..అకారణంగా తమ వారిని పోలీసులు కొట్టారంటూ మాజీ మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద జూపల్లి కృష్ణారావుకు, ఎమ్మెల్యే అనుచరులు ఎదురు పడ్డారు. అనంతరం ఇరువురి మధ్య పోలీస్ స్టేషన్ ఎదుటే తోపులాట జరిగింది.

Other Stories:ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

పోలీసులు వారిస్తున్నా ఒకరినొకరు నెట్టుకుంటూ గొడవ పడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీస్ స్టేషన్ ఎదుట జూపల్లి వర్గీయులు రాస్తారోకోకి దిగారు. అనంతరం జూపల్లి కృష్ణరావు జోక్యంతో వారు అక్కడి నుంచి కదలడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే స్థానిక ఎస్ఐ ఎమ్మెల్యే వర్గీయులకు వంత పడుతున్నారని..వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలంటూ జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.