ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

Ycp Mlc Driver Death

ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం హత్యకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబే కారణమని, అతడిపై చర్యలు తీసుకోవాలని వాళ్లు కోరుతున్నారు.

Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన

ప్రస్తుతం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోవైపు పోస్టుమార్టమ్ చేసేందుకు అంగీకరించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని మృతుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తమకు ఎవరి మీదా నమ్మకం లేదని, మహాసేన రాజేష్ మాత్రమే న్యాయం చేయగలడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మహాసేన రాజేష్ వస్తేనే పోస్టుమార్టమ్ చేసేందుకు అంగీకరిస్తామని అజ్ఞాతంలో ఉన్న కుటుంబ సభ్యులు వీడియో ద్వారా మెసేజ్ పంపారు. ప్రస్తుతం మహాసేన రాజేష్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. మరోవైపు జీజీహెచ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. వివిధ దళిత సంఘాల నేతలు, టీడీపీ నేతలు జీజీహెచ్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. జనసేన పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కాకినాడ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ నిజనిర్ధరణ కమిటీ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలపై పోలీసులు దాడి చేశారంటూ, ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య

కాగా, సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 174 సీఆర్‌పీ సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితుల పేర్లు ఫిర్యాదుదారులు చెప్పలేదని, ఈ విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగానే దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు పోస్టుమార్టమ్‌పై సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో, ఈ రోజు పోస్టుమార్టమ్ చేసే అవకాశం లేదు. చీకటి పడినందున పోస్టుమార్టమ్ చేయడం కుదరదని పోలీసులు తెలిపారు. ఒకవేళ కుటుంబ సభ్యులు అంగీకరిస్తే, రేపు ఆదివారం అయినా సరే పోస్టుమార్టమ్ చేస్తామని చెబుతున్నారు.