Jupalli Krishna Rao: కేసీఆర్.. చర్చకు మీ కొడుకు వస్తాడా? అల్లుడు వస్తాడా..? ఏ విషయంలో మీరు గొప్పోళ్లు

హుజూరాబాద్ లో ఒక వ్యక్తిని ఓడించేందుకు రూ.2వేల కోట్లతో దళిత బంధు ఇచ్చావు. మరి రాష్ట్రంలో మొత్తం దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేవలం 100 మందికి మాత్రమే దళిత బంధు ఇచ్చారు.

Jupalli Krishna Rao: కేసీఆర్.. చర్చకు మీ కొడుకు వస్తాడా? అల్లుడు వస్తాడా..? ఏ విషయంలో మీరు గొప్పోళ్లు

Jupalli Krishna Rao

Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కేసీఆర్.. అహంకారం, మేనేజ్మెంట్ గురించి నా పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారు. అహంకారానికి మారుపేరు కేసీఆర్. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశా.. అహంకారం ఉంటే ఇలా చేస్తానా అంటూ జూపల్లి ప్రశ్నించారు. అహంకారంతో వేల కోట్లు మేనేజ్ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది నువ్వు.. మేనేజ్ చేయడానికి మీలాగా అవినీతికి నేను పాల్పడలేదని జూపల్లి అన్నారు. మీరు అహంకారంతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదు.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు. డబ్బు, అహంకారంతో మంత్రులు వెళ్లినా గేట్లు తెరవంది మీరు.. మీ దగ్గర వేల కోట్లు ఉన్నా.. పదువులు ఉన్నా నా కాలి గోటికి కూడా సరిపోరు అంటూ జూపల్లి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీ కొడుకు వస్తాడా? మీ అల్లుడు వస్తాడా? చర్చకు రమ్మనండి.. ఏ విషయంలో మీరు గొప్పోళ్లు అంటూ జూపల్లి సవాల్ చేశారు.

Read Also : CM KCR : దూకుడు పెంచిన కేసీఆర్.. జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ధర్నా చౌక్ ఇందిరా పార్కును ఎత్తేశావ్. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్నావ్. 2014లో మా మ్యానిఫెస్టో అంటే భగవత్ గీతా, ఖురాన్, బైబిల్ అన్నావు.. ఇప్పుడు కూడా అదేకదా అంటూ జూపల్లి విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే అహంకారి ఎవరూలేరు. ప్రగతి భవన్‌లో బానిస కంటే.. ఢిల్లీలో ఎవరు వెళ్లిన కలిసే అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీ అయినా.. సోనియా, రాహుల్ వద్దకు ఎవరు వెళ్లినా కలిసే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ప్రగతి భవన్ వద్దకు అయిన రాగలరా? అంటూ జూపల్లి ప్రశ్నించారు. కొల్లాపూర్‌లో సభ పెట్టినప్పుడు ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేశాడని అన్నావు.. ఇప్పుడు ఏమైంది కేసీఆర్? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తుంటే నువ్వు ఓడిపోలేదా? ఎంపీగా వినోద్ ఓడిపోలేదా అని జూపల్లి ప్రశ్నించారు.

Read Also : MLA Prasanna Kumar Reddy : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

హుజూరాబాద్ లో ఒక వ్యక్తిని ఓడించేందుకు రూ.2వేల కోట్లతో దళిత బంధు ఇచ్చావు. మరి రాష్ట్రంలో మొత్తం దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేవలం 100 మందికి మాత్రమే దళిత బంధు ఇచ్చారు. మరి మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి అంటూ జూపల్లి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మీద జనాలకు నమ్మకం పోయిందని జూపల్లి అన్నారు. రైతు బంధులో 15వేలు ఇస్తామని, పెన్షన్ 4 వేలు ఇస్తామని కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్స్‌లో తెలిపింది. అది సాధ్యం కాదని ప్రచారం చేసింది మీరు.. ఇప్పుడుమాత్రం దానికి వెయ్యి ఎక్కువ పెట్టి మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇదెలా సాధ్యమవుతుందంటూ జూపల్లి ప్రశ్నించారు. కేసీఆర్ మాటలతో మరోసారి మోసపోవద్దు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని ప్రజలను జూపల్లి కోరారు.