Home » ka paul
బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, ప్రధానిగా మోదీ ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దేశం అప్పులతో వెనుజుల, శ్రీలంకగా మారుతుందని, దేశం, తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.
ఒకరు దేశాన్ని దోచుకుంటుంటే..మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీకీ పెద్ద తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే అని విమర్శించారు.
ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయాలని తానే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశానన్నారు. అలాగే వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని వద్దని కూడా తానే చెప్పానని బాంబు పేల్చారు.
సిబిఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కేఏ పాల్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్, కవిత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని చెప్పారు.
శాంతి భద్రతలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంత పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేసీఆర్ శాంతిభద్రతలు కాపాడరా? అని ప్రశ్నించారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. రాష్ట్రపతి ఎన్నికలు, ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? అనే అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పారు. దీని వెనుక లాజిక్ కూడా ఆయన రివీల్ చేశారు.
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అధికార పార్టీ నేతల వారసులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్.
వీళ్లు నిజమైన గాంధీ కుటుంబీకులు కాదు
వారిపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని కేఏ పాల్ తేల్చి చెప్పారు.