KA Paul Condemns Attack : మతం, కులం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి-కేఏ పాల్

వారిపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని కేఏ పాల్ తేల్చి చెప్పారు.

KA Paul Condemns Attack : మతం, కులం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి-కేఏ పాల్

Ka Paul Condemns Attack

Updated On : May 30, 2022 / 6:32 PM IST

KA Paul Condemns Attack : మంత్రి మల్లారెడ్డి, రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ పై జరిగిన దాడులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. వారిపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని కేఏ పాల్ తేల్చి చెప్పారు. నిన్న రెడ్డి గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ మీద జరిగిన దాడిని పాల్ ఖండించారు. రెడ్డి సామాజిక వర్గ గొడవ, దాడులు ప్రజాస్వామ్యంలో తప్పు అని అన్నారు.

మతాలను, కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయన్నారు. బెంగళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ పై దాడిని కూడా ఖండిస్తున్నట్లు పాల్ చెప్పారు. గతంలో రాజకీయాల్లో ఉన్నవారు వారి పేరు పక్కన ఉన్న తొక్కను తీసేసి ప్రజలకు సేవ చేశారని కేఏ పాల్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య చివరన రెడ్డిని తీసేశారని పాల్ గుర్తు చేశారు.

Attack On Mallareddy Convoy : రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. ఆ మాట అనడంతో రాళ్ల దాడి

మీడియా తీరుని కూడా పాల్ తప్పుపట్టారు. అనవసరమైన అంశాలకు, ప్రజలకు పనికిరాని వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని పాల్ వాపోయారు. ”ఇద్దరు రెడ్లు మీడియాలో తిట్టుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇద్దరు యూట్యూబర్స్ కొట్టుకున్నారని మూడు రోజుల పాటు మీడియా చానల్స్ లైవ్ ఇచ్చాయి. మీడియా.. ప్రజలకు చూపించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి” అంటూ మీడియాకు హితబోధ చేశారు కేఏ పాల్.

Rakesh Tikayat : రైతు సంఘం నేత రాకేష్‌ టికాయత్‌పై దాడి

చైనా 70 దేశాలకు అప్పు ఇచ్చిందని పాల్ తెలిపారు. చైనా ఇచ్చిన అప్పులు తిరిగి ఇచ్చేందుకు కొన్ని దేశాలు ముందుకు రావడం లేదన్నారు. అప్పు తీసుకున్న దేశాలు చైనాకు తిరిగి డబ్బు ఇవ్వకపోతే చైనా నాశనమైపోతుందన్నారు. దేశంలో ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని పాల్ ధ్వజమెత్తారు. మూడు నెలల్లో సంచలనం సృష్టిస్తామని బీజేపీ గవర్నమెంట్ ను రద్దు చేయాలని ఓ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి సవాల్ చేస్తున్నారని.. మళ్లీ ఎన్నికలు పెడితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని కేఏ పాల్ చురకలు అంటించారు.