KAPaul On Draupadi Murmu : అట్లుంటది పాల్‌తోని.. ఆమెను రాష్ట్రపతి చేయమని చెప్పింది నేనే-కేఏ పాల్
ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయాలని తానే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశానన్నారు. అలాగే వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని వద్దని కూడా తానే చెప్పానని బాంబు పేల్చారు.

Kapaul On Draupadi Murmu
KAPaul On Draupadi Murmu : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయాలని తానే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశానన్నారు. అలాగే వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని వద్దని కూడా తానే చెప్పానని బాంబు పేల్చారు. తన ఒరియా సోదరి రాష్ట్రపతి అవుతుండటం సంతోషంగా ఉందన్నారు కేఏ పాల్.
presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ‘జడ్’ ప్లస్ భద్రత
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావాలని భగవంతుడిని ప్రార్థించానన్నారు. దేవుడికి తాను ఎంతో రుణపడి ఉంటానని ఆనందం వ్యక్తం చేశారు కేఏ పాల్. దేశ చరిత్రలో తొలిసారి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతుండటం దేశానికే గర్వకారణం అన్నారు కేఏ పాల్.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
”ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వద్దన్న వెంకయ్య నాయుడిని ప్రెసిడెంట్ చెయ్యలేదు. నేను రిక్వెస్ట్ చేసిన నా ఒరియా సోదరిని ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. మొన్ననే నేను మీకు హింట్ ఇచ్చాను. రాష్ట్రపతిగా మహిళను చేస్తారని చెప్పాను. ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అయ్యి తీరుతుందని మీకు లాస్ట్ వీక్ లోనే చెప్పా. ఈవిడను రాష్ట్రపతిని చెయ్యాలని దేవుడిని ప్రార్థించాను. దేవుడి నా మొర విన్నాడు. ఆమెను రాష్ట్రపతిని చేసినందుకు నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఆవిడ చాలా క్లీన్ ఉమెన్. గవర్నర్ గా తన క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుంది. పైగా ఆమె నా ఒరియా సోదరి” అని కేఏ పాల్ అన్నారు.
presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముర్ము అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన ముర్ము సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైదపోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే ఆదివాసీ తెగ కుటుంబంలో ముర్ము జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించిన ముర్ము…శ్యామ్ చరణ్ ముర్మును వివాహమాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉండగా… చాలా కాలం క్రితమే భర్తతో పాటు ఇద్దరు కుమారులు చనిపోయారు.
ముర్ము రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే… ఆదిలోనే బీజేపీలో చేరిన ముర్ము 2000 మార్చిలో ఒడిశాలో కొలువుదీరిన బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వాణిజ్య, రవాణా, మత్స్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ముర్ము సత్తా చాటారు. ఆ తర్వాత 2015లో ఝార్ఖండ్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ముర్ము.. ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాటు గవర్నర్‌గా కొనసాగిన తొలి గవర్నర్‌గా చరిత్ర సృష్టించారు. తాజాగా ఆమె ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికయ్యారు.