Home » Karnataka Elections 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. 23 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులోనూ మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు.
బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలోనే కలుసుకున్నారు. తన టికెట్ గురించే నడ్డాతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే హైకమాండ్ దీనిపై ఏమైనా హామీ ఇచ్చిందా అనే విషయాన్ని మాత్రం షెట్టర్ వెల్లడించలేదు
కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు అన్నీ అభ్యర్థుల జాబితాల విడుదలపై దృష్టి పెట్టాయి.
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
కాంగ్రెస్ పార్టీలో తనను గుర్తిస్తారని చాలా ఎదురుచూశానని, అయితే తనను బీజేపీ గుర్తించిందని, అందుకే కమలదళంలో చేరానని రాజనందిని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు
Karnataka Elections 2023: తొలి జాబితాలో పలువురు ఐపీఎస్ లకు చోటు దక్కింది. 32మంది ఓబీసీ, 30మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్థులకు చోటు దక్కింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సమావేశానికి యెడియూరప్పను దూరంగా ఉంచింది.
ఇంగ్లాండులో భారత రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. విదేశీ గడ్డపై స్వదేశాన్ని అవమానించడం దారుణమైన సంస్కృతని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే యావలో దేశాన్ని కించపరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి పట
అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూర్చేలా కేఎస్ ఈశ్వరప్ప తీరు ఉంది.
రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదమే ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది