Home » Minister Jogi Ramesh
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్, చంద్రబాబు విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు.
భీమవరం, గాజువాకలో గ్లాస్ పగిలిపోతే పవన్ పిఠాపురం పారిపోయాడు. చంద్రబాబును చంద్రగిరిలో ఓడిస్తే కుప్పం పారిపోయాడు.
పెనమలూరు వైసీపీలో టికెట్ ప్రకంపనలు రేగాయి. పెనమలూరు సీటును మంత్రి జోగి రమేశ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ తన పదవికి రాజీనామా చేశారు.
టీడీపీతో కలిశాక కాపులు పూర్తిగా జనసేనకు దూరం అయ్యారు. పవన్ కి సిగ్గులేదు కనుకనే టీడీపీతో కలిశాడు. కాపులకు దమ్ము దైర్యం ఉంది టీడీపీ దగ్గరకి వెళ్లరు
అమర్నాథ్ హత్య చాలా ఘోరం. 24 గంటలలోపు ముగ్గురిని అరెస్టు చేశామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. అమర్నాథ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉందని, రూ.10లక్షల నష్టపరిహారం అందించామని చెప్పారు.
ప్రతి ఇంటివద్ద మద్యాన్ని ఏరులైపారించిది చంద్రబాబు. పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేక అల్లాడుతాడు. అలాంటి చంద్రబాబు పేదలను ధనికులను చేస్తాడా?
బీసీలకు ఏనాడైనా ఒక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారా? క్యాబినెట్లో బీసీలకు జగన్ ఇచ్చినన్ని పదవులు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చారా? పేదల రక్తాన్ని తాగే చంద్రబాబు పేదలను కోటీశ్వరుడిని చేస్తానంటే నమ్ముతారా? అని మంత్రి జోగిరమేష్ ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు నివసిస్తే అంటరానితనం అంటూ అడ్డుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని మండిపడ్డారు.
సెల్ఫీలు అంటూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని పేర్కొన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశారు? తమ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశామో రా చర్చిద్దామని సవాల్ చేశారు.
టిట్కో ఇళ్లపై చంద్రబాబు ట్వీట్ కి సమాధానం చెప్పటానికి నేను సిద్దంగా ఉన్నాను..మరి రూ. కోటి యాభై లక్షల ఇళ్ల దగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ప్రతి సవాల్ విసిరారు జోగి రమేశ్.