ఎగ్జిట్ పోల్స్‌, చంద్రబాబు విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌, చంద్రబాబు విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు.

ఎగ్జిట్ పోల్స్‌, చంద్రబాబు విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్

Updated On : June 1, 2024 / 1:37 PM IST

Minister Jogi Ramesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. చంద్రబాబు ఏ దేశానికి వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోడానికి వెళ్లారు కనుకే ఇంత సీక్రెట్‌గా ఉంచారని ఆరోపించారు.

ఏబీవీ టీడీపీ తొత్తు
ఏబీ వెంకటేశ్వరావు టీడీపీ తొత్తుగా వ్యవహరించారని.. పరికరాల కొనుగోలు స్కాంలో కేంద్ర నిఘా వ్యవస్థ కూడా ఆయన పాత్ర ఉందని నిర్ధారించిందన్నారు. ”ఏబీవీ ఒంటిపై బట్టలు మాత్రమే ఖాకీ. లోపల అంతా యెల్లోనే. ఆయన చరిత్ర ప్రజలకు తెలుసు. నిన్నటితో మరింతగా నిజస్వరూపం బయటపడింద”ని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఆస్పత్రిలో చేరడం ఖాయం
ఎగ్జిట్ పోల్స్‌తోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడబోతుందని.. జూన్ 4న చంద్రబాబుకి మూర్చ వచ్చి హాస్పిటల్ లో చేరడం తథ్యమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని, పార్టీ శ్రేణులంతా సంబరాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కాగా, ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?

తిరుమలలో రాజకీయాలు మాట్లాడను: మంత్రి కాకాని
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ”తిరుమల మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు సువర్ణ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నారు. మరో ఐదు సంవత్సరాలు ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నాను. తిరుమలలో రాజకీయాలు మాట్లాడన”ని అన్నారు.