Home » ODI World Cup-2023
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. అదే సమయంలో దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, కుమార సంగక్కర రికార్డులను బ్రేక్ చేశాడు.
వన్డే ప్రపంచకప్లో మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆ తరువాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైంది.
ఇర్ఫాన్ పఠాన్ మామూలుగా చాలా కూల్ ఉంటాడు. కానీ పాకిస్థాన్ జట్టును అఫ్గానిస్తాన్ చిత్తుగా ఓడించినప్పుడు మాత్రం అతడు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 24వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. సౌతాఫ్రికాపై అనూహ్య విజయం సాధించిన డచ్ టీమ్ మరోసారి ఈ ఫీచ్ రిపీట్ చేయాలని పట్టుదలతో ఉంది.
చీలమండ గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఉన్న హార్ధిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడు. పాండ్యా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఎంతో ఇబ్బందిగా ఉంది. 280కిపైగా పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించడం అనేది చాలా పెద్ద విషయం. పిచ్ తడిగా ఉందా లేదా అనేది పక్కనపెడితే ఓసారి పాకిస్థాన్ ప్లేయర్స్ ఫీల్డింగ్ చూడండి..
పాక్ జట్టుపై విజయం తరువాత స్టేడియంలో అఫ్గాన్ ఫ్లేయర్స్ సంబురాలు చేసుకున్నారు. మైదానం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు.
పాకిస్థాన్ - అఫ్గాన్ మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో.. భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్ అభిమానులు టీమిండియా నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.
మెగా టోర్నీలో ఒక్కొ మ్యాచులో గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వివరించాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు వరుసగా ఐదు మ్యాచులు గెలవడం పట్ల సంతోషంగా ఉందన్నాడు.