AUS vs NED: నెద‌ర్లాండ్స్ పై 309 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 24వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. సౌతాఫ్రికాపై అనూహ్య విజయం సాధించిన డచ్ టీమ్ మరోసారి ఈ ఫీచ్ రిపీట్ చేయాలని పట్టుదలతో ఉంది.

AUS vs NED: నెద‌ర్లాండ్స్ పై 309 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం

AUS vs AFG

Updated On : October 25, 2023 / 8:45 PM IST

ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం
400 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన నెద‌ర్లాండ్స్ 21 ఓవ‌ర్ల‌లో 90 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆస్ట్రేలియా 309 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్ల‌లో విక్రమ్‌జిత్ సింగ్ (25) ఒక్క‌డే కాస్త ఫ‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో జంపా నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ మార్ష్ రెండు, మిచెల్ స్టార్క్‌, జోస్ హేజిల్ వుడ్‌, పాట్ క‌మిన్స్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఓట‌మి దిశ‌గా నెద‌ర్లాండ్స్‌
భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో నెద‌ర్లాండ్స్ త‌డ‌బ‌డుతోంది. 86 పరుగుల‌కే 8 వికెట్లు కోల్పోయింది. తేజా నిడ‌మ‌నూరు (14), వాన్ బీక్ (0), వాన్ డెర్ మెర్వే(0) లు ఔట్ అయ్యారు.

కష్టాల్లో నెదర్లాండ్స్
62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి నెదర్లాండ్స్ కష్టాల్లో పడింది. మాక్స్ ఓడౌడ్(6), విక్రమ్‌జిత్ సింగ్ (25), కోలిన్ అకెర్‌మాన్(10), బాస్ డి లీడే (4), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (11) అవుటయ్యారు.

నెదర్లాండ్స్ 5 ఓవర్లలో 33/1
400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మాక్స్ ఓడౌడ్(6) స్టార్క్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. నెదర్లాండ్స్ 5 ఓవర్లలో 33/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

ఆస్ట్రేలియా పరుగుల జోరు.. నెదర్లాండ్స్ కు భారీ టార్గెట్
నెదర్లాండ్స్ కు ఆస్ట్రేలియా 400 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వార్నర్ (104), మాక్స్‌వెల్ (106) సెంచరీలతో కదంతొక్కారు. స్టీవెన్ స్మిత్(71), లబుషేన్(62) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 4, లోగాన్ వాన్ బీక్ 2 వికెట్లు పడగొట్టారు. ఆర్యన్ దత్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

మాక్స్‌వెల్ ఫాస్టెస్ట్ సెంచరీ
గ్లెన్ మాక్స్‌వెల్ మెరుపు శతకం సాధించాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ బాదాడు. ప్రపంచకప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. 106 పరుగులు చేసి అవుట్ కావడంతో మాక్స్‌వెల్ సునామీ ఇన్నింగ్స్ కు తెరపడింది.

 

వార్నర్ అవుట్.. ఐదో వికెట్ డౌన్
39.1 ఓవర్ లో 267 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సెంచరీ హీరో వార్నర్(104) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. జోష్ ఇంగ్లిస్ (14) నాలుగో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 41 ఓవర్లలో 282/5 స్కోరుతో ఆస్ట్రేలియా ఆట కొనసాగిస్తోంది.

డేవిడ్ వార్నర్ సెంచరీ
ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ వరల్డ్ కప్ లో వరుసగా రెండో సెంచరీ కొట్టాడు. 91 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 22వ సెంచరీ. ప్రపంచకప్ లో మొత్తం 6 సెంచరీలు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.

 

లబుషేన్ హాఫ్ సెంచరీ
మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీ చేశాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో అర్ధశతకం పూర్తి చేశాడు. 36 ఓవర్లలో 244/2 స్కోరుతో ఆస్ట్రేలియా ఆట కొనసాగిస్తోంది.

స్మిత్ అవుట్.. రెండో వికెట్ డౌన్
23.3 ఓవర్ లో 160 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ఆర్యన్ దత్ బౌలింగ్ లో స్టీవెన్ స్మిత్ అవుటయ్యాడు. స్మిత్ 68 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 71 పరుగులు చేశాడు.

వార్నర్, స్మిత్ హాఫ్ సెంచరీలు
డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీలు చేశారు. ముందుగా వార్నర్, తర్వాత స్మిత్ అర్ధశతకాలు బాదారు. వార్నర్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. స్మిత్ 53 బంతుల్లో 7 ఫోర్లతో అర్ధశతకం చేశాడు. 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది.

 

నిలకడగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ 
ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(31), స్టీవెన్ స్మిత్ (45) ఆడుతున్నారు.

ఆరంభంలో ఆసీస్ కు షాక్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలోనే వికెట్ నష్టపోయింది. 3.5 ఓవర్ లో 28 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ మిచెల్ మార్ష్(9) అవుటయ్యాడు. ఆస్ట్రేలియా తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(18), స్టీవెన్ స్మిత్ (2) క్రీజ్ లో ఉన్నారు.

 

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా

నెదర్లాండ్స్ : విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజ నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్ కీపర్), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

 

డచ్ టీమ్ మ్యాజిక్ చేస్తుందా?
AUS vs NED: వన్డే ప్రపంచకప్ లో భాగంగా నేడు జరుగుతున్న 24వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడిన ఆస్ట్రేలియా రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్ లో గెలిచి సెమీస్ సమరానికి చేరువ కావాలని ఆసీస్ టీమ్ భావిస్తోంది. నెదర్లాండ్స్ నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక్క విజయం మాత్రమే అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికాపై అనూహ్య విజయం సాధించి డచ్ టీమ్ మరోసారి మ్యాజిక్ చేస్తుందో, లేదో చూడాలి.