Irfan Pathan: పాకిస్థాన్ పై అఫ్గానిస్తాన్ విజయం.. ఇర్ఫాన్ పఠాన్ ఎందుకలా డాన్స్ చేశాడు?

ఇర్ఫాన్ పఠాన్ మామూలుగా చాలా కూల్ ఉంటాడు. కానీ పాకిస్థాన్ జట్టును అఫ్గానిస్తాన్ చిత్తుగా ఓడించినప్పుడు మాత్రం అతడు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు.

Irfan Pathan: పాకిస్థాన్ పై అఫ్గానిస్తాన్ విజయం.. ఇర్ఫాన్ పఠాన్ ఎందుకలా డాన్స్ చేశాడు?

irfan pathan dances with rashid khan after afghanistan win against pakistan

Irfan Pathan Dance: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సాధారణంగా చాలా కూల్ ఉంటాడు. గెలుపోటముల్లో పెద్దగా భావోద్వేగాలు వ్యక్తం చేయడు. ముఖ్యంగా సంబరాల్లో డాన్పులు వంటివి చేయడం మనం పెద్దగా చూడలేదు. కానీ ప్రపంచకప్ లో పాకిస్థాన్ జట్టుపై అఫ్గానిస్తాన్ గెలిచినప్పుడు మాత్రం అతడు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. చెన్నై స్టేడియంలో అఫ్గానిస్తాన్ ఆటగాళ్లతో కలిసి ఆనందోత్సాహాలను పంచుకున్నాడు. అఫ్గానిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తో డాన్స్ చేశాడు. మిగతా ప్లేయర్స్ అందరూ వారిని ఉత్సాహపరిచారు. ఇర్ఫాన్ పఠాన్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, పాకిస్థానీయులు బాగా ట్రోలింగ్ చేయడం వల్లే ఇర్ఫాన్ పఠాన్ ఇంతలా ఎమోషన్ అయ్యాడని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 282 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ మరో ఓవర్ మిగిలివుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (65), ఇబ్రహీం జద్రాన్(87), రహమత్ షా(77) హాఫ్ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఫస్ట్ టైమ్ వన్డేల్లో పాక్ పై అఫ్గాన్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై విమర్శలు వెలువెత్తాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఖుష్ అయ్యారు.

అఫ్గానిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ హ్యాపీ
పాకిస్థాన్ పై గెలవడం ప్రపంచకప్ గెలిచినంత ఆనందంగా ఉందని అఫ్గానిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ అన్నారు. “ఇది నిజంగా అద్భుతం. పాకిస్తాన్‌ను అఫ్గానిస్తాన్ ఓడించడం నిజంగా అద్భుతమైన విషయం. అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారు ప్రపంచ కప్ గెలిచినట్లు సంబరపడిపోతున్నారు. ప్రపంచ కప్ గెలవడం కంటే ఇది చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. అద్భుతమైన మ్యాచ్ ఇది. చెన్నై స్టేడియం బాగా నచ్చింది. చెన్నై ప్రజలు మా జట్టుకు మద్దతు ఇచ్చారు. మాకు మద్దతు ఇచ్చినందుకు భారతీయులకు ధన్యవాదాలు. మాజట్టు సెమమీఫైనల్ కు చేరుతుందని అనుకుంటున్నాన”ని అఫ్గాన్ అభిమాని ఒకరు అన్నారు.

Also Read: ఇంగ్లాండ్ తో మ్యాచ్ కూ హార్దిక్ పాండ్యా దూరం..! రీఎంట్రీ ఎప్పుడంటే?