Home » Rainy Season Precautions During Aqua Farming
అధిక వర్షాలు, ఎండలతో, తీవ్ర వాతావరణ ఒడిదుడుకుల మధ్య సాగు కొనసాగుతుంది. కనుక తరచూ రొయ్యలు ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. పైగా చెరువులకు కొత్తనీరు ఎక్కువ పెడతారు కనుక, వివిధ హానికారక క్రిములు, బాక్టీరియా, వైరస్ ల బెడద ఎక్కువ వుంటుంది.
ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో రెండంగుళాల సైజులో అంటే ఫింగర్ లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు.
రొయ్యలకు సోకే వ్యాధుల్లో వైట్ గట్ వ్యాధి అతి భయంకరమైనది. ఇది సోకిన రెండ్రోజుల్లోనే రొయ్యలు మరణిస్తాయి. ఒక్కో సారి ఈ వ్యాధి సోకితే ఆ చెరువుల్లో పూర్తిస్థాయిలో వ్యాధికారకమైన జీవులు నశించేలా యాజమానులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విబ్రయోజాతి�