Shrimp Cultivation : రొయ్యలకు వైరస్ ల ముప్పు.. సమయానుకూలంగా చేపట్టాల్సిన జాగ్రత్తలు

రొయ్యలకు సోకే వ్యాధుల్లో వైట్ గట్ వ్యాధి అతి భయంకరమైనది. ఇది సోకిన రెండ్రోజుల్లోనే రొయ్యలు మరణిస్తాయి. ఒక్కో సారి ఈ వ్యాధి సోకితే ఆ చెరువుల్లో పూర్తిస్థాయిలో వ్యాధికారకమైన జీవులు నశించేలా యాజమానులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విబ్రయోజాతికి చెందిన విబ్రియో సర్వేపారాహిమోలైటికస్ వంటి బ్యాక్టీరియాల వల్ల విబ్రియోసిస్ వ్యాధి సోకుతుంది.

Shrimp Cultivation : రొయ్యలకు వైరస్ ల ముప్పు.. సమయానుకూలంగా చేపట్టాల్సిన జాగ్రత్తలు

Shrimp Cultivation

Shrimp Cultivation : మిలియన్ డాలర్ల పంటగా పేరొందిన వనామి రొయ్యల సాగుకు గడ్డుకాల సమయం. వ్యాధుల తీవ్రత పెరిగి పంట ఎదుగుదలకు అవరోదంగా మారుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, చెరువుల్లో సరైన యాజమాన్యం చర్యలు చేపట్టకపోవడానికి తోడు, నాణ్యమైన పిల్లల ఎంపిక చేయకపోవడంతో రొయ్యరైతులు తీవ్రనష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

READ ALSO : Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల , రోగకారక సూక్ష్మక్రిముల బారిన పడి చేపలు , రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉంది . ముఖ్యంగా చెరువుల్లో ప్రాణవాయువు తక్కువ మోతాదులో కరుగుతుంది. తద్వరా నీటిలో అధిక సాంద్రతలో పెరుగుతున్న చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతాయి. సాధారణంగా రొయ్యలకు వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ప్రోటోజోవా, పోషకాహార, జన్యుపరమైన లోపాలతో పాటు వాతావరణంలో మార్పుల వల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.

రొయ్యలకు సోకే వ్యాధుల్లో వైట్ గట్ వ్యాధి అతి భయంకరమైనది. ఇది సోకిన రెండ్రోజుల్లోనే రొయ్యలు మరణిస్తాయి. ఒక్కో సారి ఈ వ్యాధి సోకితే ఆ చెరువుల్లో పూర్తిస్థాయిలో వ్యాధికారకమైన జీవులు నశించేలా యాజమానులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విబ్రయోజాతికి చెందిన విబ్రియో సర్వేపారాహిమోలైటికస్ వంటి బ్యాక్టీరియాల వల్ల విబ్రియోసిస్ వ్యాధి సోకుతుంది. సాగు చెరువు నిర్వాహణలో ఎలాంటి లోపం ఉన్నా ఇది సోకుతుంది.

READ ALSO : Organic Prawn Farming : ఆర్గానిక్ పద్ధతిలో రోయ్యల సాగు

కాబట్టి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ.. సమయానుకూలంగా, మేలైన యాజమాన్యం చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ రొయ్యల సాగులో దీర్ఘకాల వ్యాధి. మేత అధికంగా ఇవ్వడం, మినరల్స్ , ఇతర రసాయనాలను అవసరం లేకపోయినా వాడడం, చెరువుల్లో సేంద్రియ పదార్థాల గాఢత ఎక్కువైనప్పుడు రొయ్యలు క్రమేణా చనిపోతుంటాయి. దీని వల్ల చెరువుల్లో పిల్ల సంఖ్య తగ్గడంతో పాటు ఖర్చుపెరిగి నష్టం వాటిల్లుతుంది.

రొయ్యలసాగులో వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి, శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తేనే మంచి ఫలితాలను సాధించేదుకు వీలుంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన హేచరీల నుంచే నాణ్యమైన పిల్ల ఎంపిక చేసుకోవాలి. చెరువుల నిర్వాహణలో జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. నీరు, మట్టి, రొయ్య నిత్యం పరీక్షించుకోవాలి. ఈ సమస్యల నుండి రైతు అధిగమించాలంటే రొయ్య సాగులో చేపట్టాల్సిన మెళకువలు ఏంటో తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా , ఉండి మత్స్యపరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. నీరజా తంబిరెడ్డి .

READ ALSO : రైతన్నకు సహాయం: వ్యవసాయం చేస్తున్న బాతులు